Rapper Viral Video: అభిమాని పట్ల దురుసుగా.. మహిళ ఫోన్‌ను విసిరేసిన ర్యాపర్..! వీడియో ట్రెండ్..
సెలబ్రిటీలు ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ర్యాపర్ బ్యాడ్ బన్నీగా పేరొందిన బెనిటో ఆంటోనియో ఒకాసియో ఓ మహిళా అభిమాని ఫోన్‌ను లాక్కుని విసిరేసిన వీడియో
సెల్ఫీ కోసం అభిమాని ర్యాపర్ ముఖానికి దగ్గరగా రావడంతో చిర్రెత్తుకొచ్చిన ర్యాపర్ ఆమెకు షాక్ ఇచ్చాడు.మహిళ చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్న ర్యాపర్ దాన్ని దూరంగా విసిరివేయడంతో ఆమె ఖంగుతింది. ర్యాపర్ తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వేదిక వద్దకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా ఇప్పటివరకూ 1.26 లక్షల మంది వీక్షించారు.ఇందుకు ర్యాపర్ వివరణ ఇస్తూ, ఎవరైనా అభిమాని తనకు హలో చెప్పేందుకు, మాట్లాడేందుకు, కలిసేందుకు తన వద్దకు వస్తే వారికి తాను ఎంతో గౌరవం ఇచ్చి పలకరిస్తానని చెప్పారు. ఎవరైనా ఫోన్ తన ముఖంపైకి తీసుకువస్తే అది తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించినట్టు భావిస్తానని, వారిని అదే రీతిలో ట్రీట్ చేస్తానని ఆయన ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..