Baby Elephant: చిట్టి తొండంతో ఆడుకుంటున్న బుజ్జి ఏనుగు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో.
జంతువులకు జంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జంతువుల పిల్లలు చాలా క్యూట్‌గా ఉంటాయి. అవి చేసే అల్లరి కూడా చూడముచ్చటా ఉంటుంది.
జంతువులకు జంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జంతువుల పిల్లలు చాలా క్యూట్‌గా ఉంటాయి. అవి చేసే అల్లరి కూడా చూడముచ్చటా ఉంటుంది. తాజాగా ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిట్టి ఏనుగు తన తల్లిఏనుగుతో కలిసి ఉంది. అది తన తొండంతో చిత్ర విచిత్రంగా ఆడుకుంటోంది. తన తొండాన్ని మెలిపెడుతోంది. కాలుతో తొక్కతోంది. పైకెత్తి రౌండ్‌గా చుడుతుంది. అలా ఆడుకుంటూనే ఉంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అది చూసిన కొందరు ఏనుగు పిల్ల భూమిపై జీవించడానికి అవసరమైన ప్రాక్టీస్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగు పిల్ల ఒక ఏడాది వరకు తన తొండాన్ని నియంత్రించుకోవడాన్ని నేర్చుకోలేదని జంతుశాస్త్ర నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఏనుగు తొండం దానికి ఒక చెయ్యిలాగా పనిచేస్తుంది. అదేవిధంగా దానికి ముక్కులాగా ఊడా పనిచేస్తుంది. ఏదైనా వస్తువును పట్టుకోవడం, నీరు తాగడం, వాసన చూడటం, ప్రేమను వ్యక్తం వంటి అనేక పనులకు వాటి తొండం సహకరిస్తుంది. ఇలా అన్ని పనులకు సహాయపడే ఏనుగు తొండంలో సుమారు 40,000 కండరాలు ఉంటాయట. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ నీరు ఉందో లేదో తెసుసోడానికి ఈ తొండం ఎంతగానో ఉపయోగపడుంది. సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారం, నీటిని ఈ తొండంతో పసిగడతాయట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

