Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తన అనుచరులతో ట్విట్టర్లో స్ఫూర్తిదాయకమైన పోస్ట్లు సరదా వీడియోలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఓ చిన్న వీడియో క్లిప్ తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. చాలా చిన్న వీడియో ఇది. కానీ, దీనిని చూస్తే మాత్రం అందరూ కచ్చితంగా గుండెల మీద చేయి వేసుకుని అమ్మో అనుకుంటారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక చిన్న సందు. దానిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో వేగంగా ఆ సందులోకి ఒక ఆటో దూసుకు వచ్చింది. అక్కడ సందులో వేగంగా తిరగడంలో అది దాదాపుగా ఒక పక్కకు పూర్తిగా పడిపోయే పరిస్థితిలోకి వచ్చినట్టు అయింది. అదే సమయంలో దానినుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి వేగంగా స్పందించి ఆ ఆటోను ఒక్కసారిగా పక్కకు తోసాడు. దీంతో పడిపోతుంది అనిపించినా ఆటో సక్రమంగా అయిపోయి వేగంగా వెళ్ళిపోయింది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. అయినా దీనిని వీడియో చూస్తేనే మీకు సరిగ్గా కనెక్ట్ అవుతుంది. అందుకే ఆ వీడియో ఇక్కడ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో చూసేయండి..
Hilarious. Nothing beats Desi ‘Tech-Humour.’ I’d love to see more such Desi Depictions of Digital terms. What would you show for ‘Spell Check?’ A devotee gazing at a meditating Guru? pic.twitter.com/XNdK5ySCnU
— anand mahindra (@anandmahindra) June 22, 2021
చూశారుగా.. ఇప్పుడు చెప్పండి ఏమంటారు. ఈ వీడియో చివర్లో ఇచ్చిన ‘ఆటో కరెక్ట్’ కరెక్టే అని ఒప్పుకుంటారు కదూ. దీనికి ఆనంద్ కూడా మంచి కామెంట్ రాశారు. ” దేశి ‘టెక్-హ్యూమర్’ను ఏమీ కొట్టడం లేదు. డిజిటల్ పదాల ఇలాంటి దేశీ వర్ణనలను చూడటానికి నేను ఇష్టపడతాను. ‘స్పెల్ చెక్’ కోసం మీరు ఏమి చూపిస్తారు? ధ్యానం చేసే గురువుని చూస్తున్న భక్తుడు?” అంటూ రాశారు.
ఇక ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది ట్విట్టర్ లో. చాలామంది దానికి కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్ల ట్వీట్ లు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నట్టు ఆనంద్ మహీంద్ర ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సరదా అయిన ట్వీట్ లు చేస్తూనే ఉంటారు. ఆయన్ని అనుసరించే వారు ఎప్పుడూ మంచి విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. ఈ వీడియో చిన్నదైనా అద్భుతమైనదని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
Sir ji ye to Bahuballi part 3????
— TopiSAnkhyan (@AnkhyanS) June 22, 2021
Thank God it’s Autocorrected!… Else this run dash made by an Auto would hav deleted the pedestrian on spot.
“Auto delete”(App).— Shobs (@Tobu98027951) June 23, 2021
Also Read: Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!