Viral Video: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు.! ఆనంద్ మహీంద్రా ఫన్నీ ఆన్సర్..
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరేం అడిగినా.. ఓపికగా సమాధానం చెప్తుంటారు. అయితే ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇవ్వలేకపోయారు కానీ, ఫన్నీగా బదులిచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరేం అడిగినా.. ఓపికగా సమాధానం చెప్తుంటారు. అయితే ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇవ్వలేకపోయారు కానీ, ఫన్నీగా బదులిచ్చారు. ఒక యూజర్.. ‘‘సర్.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పుడో చెప్పండి’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ సరదా ట్వీట్‌ను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎవరు సార్ తీసేది అంటూ ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. కాగా.. కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో.. అదీ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

