విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!
విమానం గాలిలో ఉండగానే ప్రయాణికులు సిబ్బందిపై దాడి తెగబడుతున్నారు. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఘటన మరువకముందే మరో సంఘటన అమెరికాలో వెలుగుచూసింది.
విమానం గాలిలో ఉండగానే ప్రయాణికులు సిబ్బందిపై దాడి తెగబడుతున్నారు. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఘటన మరువకముందే మరో సంఘటన అమెరికాలో వెలుగుచూసింది. విమాన సిబ్బందిపై దాడి చేసిన ఓ ప్యాసెంజర్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. శాన్ హోసే నుంచి లాస్‌ఏంజిలిస్ వెళుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమాన ప్రయాణికుల్లో ఒకరు ఘటన మొత్తాన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి నెట్టింట్లో పెట్టారు. విమానంలో ఒకడు ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక్కడ హంతుకులు ఉన్నారంటూ గొణగడం ప్రారంభించాడు. విమాన సిబ్బంది అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ప్యాసింజర్ మాత్రం నోరుపారేసుకున్నాడు. అంతేకాదు ఫ్లైట్ ఎటెండెంట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈలోపు ఇతర ప్రయాణికులు కల్పించుకుని అతడిని అదుపు చేశారు. విమానం లాస్ ఏంజిలిస్‌లో దిగాక అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘనటపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్.. నిందితుడిపై విమాన ప్రయాణ నిషేధం విధించింది. ఇక, నేరం చేసినట్టు తేలితే నిందితుడికి ఏకంగా 20 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
TOP 9 ET News: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే || 3డీలో శాకుంతలం
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

