పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోస్ వైరలవుతున్నాయి. అందులో క్రూరమృగాలు.. పెంపుడు జంతువులకు చెందినవి అనేకం.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోస్ వైరలవుతున్నాయి. అందులో క్రూరమృగాలు.. పెంపుడు జంతువులకు చెందినవి అనేకం. అయితే వాటిలో కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తాయి.. కొన్ని మాత్రం వెన్నులో వణుకుపుట్టిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా పనిమీదో, లేక సఫారీకో అడవికి వెళ్లిన్పుడు ఒక్కోసారి అక్కడ విడిది చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్యాంపింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదకరమైన జంతువులు ఎదురుపడతాయి. తాజా వీడియోలో ఒక వ్యక్తి తాళ్ల సహాయంతో చెట్టుపైకి ఎక్కుతున్నాడు. అదే సమయంలో ఆ చెట్టు పక్కన ఉన్న మరో చెట్టు మీద సింహం ఉంది. అది గమనించిన వ్యక్తి చెట్టు ఎక్కడం ఆపేసి అక్కడే నిల్చున్నాడు. అది అతనిపై ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డాడు. అతను ఊహించింది నిజమే… ఆ సింహం పెద్దగా గర్జిస్తూ అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటజన్లు షాకవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
TOP 9 ET News: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే || 3డీలో శాకుంతలం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

