Mumbai Airport: ఎయిర్‌పోర్టులో వీల్ చైర్ లేక 80 ఏళ్ల పెద్దాయన గుండెపోటుతో మృతి.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్‌చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్‌చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. వీల్ చైర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవనీ అందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్ది సేపే వేచి ఉండాలని తాము కోరామనీ అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడని తెలిపింది. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడనీ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతడు మరణించినట్లు తెలిసిందని అంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని తమ సంస్థకు ఒక పాలసీ ఉందని ఎయిర్ ఇండియా తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

