Africa Kids Dance: గోమీ గోమీ పాటకు ఇరగదీసిన ఆఫ్రికా కిడ్స్.. డాన్స్ వీడియోకి 3 కోట్ల వ్యూస్..
ఆఫ్రికా కిడ్స్ డాన్స్‌ను ఇరగదీశారు. గోమీ గోమీ పాటకు... అరటి చెట్ల దగ్గర అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఆ రిథమిక్ డాన్స్ నెటిజన్లకు తెగ నచ్చుతోంది.
ఆఫ్రికా కిడ్స్ డాన్స్‌ను ఇరగదీశారు. గోమీ గోమీ పాటకు… అరటి చెట్ల దగ్గర అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఆ రిథమిక్ డాన్స్ నెటిజన్లకు తెగ నచ్చుతోంది. అందుకే ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. వాళ్ల డాన్స్ చూస్తుంటే… మాకు కూడా వెళ్లి వాళ్లతో చెయ్యాలని ఉందని నెటిజన్లు అంటున్నారు. అరబిక్ సాంగ్ గోమీ గోమీ టిక్ టాక్‌లో వైరల్ అవ్వడంతో… దాన్ని అందుకున్న ఆఫ్రికా కిడ్స్ .. అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ సాంగ్‌ని లెబనీస్ సింగర్ మిరియమ్ ఫార్స్ పాడారు. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేసినా… ఆఫ్రికాకు చెందిన చిన్న పిల్లలు చేసిన డాన్స్ క్లిప్ అన్నింటికంటే ఎక్కువ వైరల్ అయ్యింది. ఈ సాంగ్‌ని ఇప్పటివరకూ 3 కోట్ల మందికి పైగా చూడగా… 21 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ని ఉగాండాకు చెందిన స్వచ్ఛంధ సంస్థ మసాకా కిడ్స్ ఆఫ్రికానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జూన్ 24, 2022న పోస్ట్ చేసిది. ఈ సాంగ్‌ని ఇప్పటివరకూ 3 కోట్ల మందికి పైగా చూడగా… 21 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆఫ్రికాలో అరటి, కోకో చెట్ల సాగు ఎక్కువ. అక్కడ ఎక్కువ మంది ఈ వ్యవసాయ తోటల్లో పనిచేస్తుంటారు. సైకిళ్లపైనే పదుల సంఖ్యలో అరటిగెలలను మోసుకుంటూ కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అమ్ముకుంటారు. అలా వారు నిత్యం బతుకుదెరువు కోసం పోరాడతారు. అలాంటి చోట ఈ పిల్లలు తమలో నైపుణ్యానికి సాన పెట్టుకుంటున్నారు. నేలపై, కనీసం చెప్పులు కూడా లేకుండా చాలా బాగా డాన్స్ చేశారు. సాంగ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్ సింక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..