Thirsty Snake: పామును చూస్తేనే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే అక్కడ నుంచి పరిగేట్టేస్తాం. లేదంటే చుట్టూ కర్ర కోసం వెతికేస్తాం. కానీ, ఒక యువకుడు దాహంతో ఉన్న నాగుపాముకు నీరు పట్టి చక్కగా పంపించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సంఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడుకు చెందిన కడలూరు అటవీ ప్రాంతం. అక్కడ దగ్గరలో నివాసం ఉండే వారి ఇంటి వద్ద ఒక నాగుపాము కనిపించింది. దానిని చూసిన అతనికి అది దాహంతో ఉందనిపించింది. వెంటనే అతను తన దగ్గరున్న మంచినీటి సీసాను ఆ పాము కు అందించి నీటిని తాగేలా చేశాడు. తరువాత ఆ నీటిని నేలపై చల్లి తాగడానికి వీలుగా చేశాడు. ఆ పాము నీళ్ళు తాగి.. సేద తీరిన తరువాత దానిని పట్టుకుని తీసుకువెళ్ళి సమీపంలోని అడవిలో వదిలిపెట్టేశాడు.
ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ యువకుడి పేరు సెల్వ. అతను అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పాములు ఎవరైనా చూసి భయపడితే..వాటికి ఏమాత్రం హాని కలగకుండా పట్టుకుని సురక్షిత ప్రాంతాలలో విడిచి పెడుతుంటాడు. ఇతను చేసిన పనికి అక్కడున్న వారంతా అతన్ని అభినందించారు. సెల్వ ఇలా పాములను పట్టుకుని వాటిని రక్షించడం ఇది మొదటిసారి కాదు. కానీ, సెల్వ చేస్తున్న పనిని చూసిన ఒక స్థానికుడు దానిని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
సెల్వ ఆ పాముకు నీళ్ళెలా తాగించాడో మీరూ చూసేయండి ఈ వీడియోలో..
Kind man seen quenching a snake’s thirst battling scorching summer. pic.twitter.com/v2UpVzBfYB
— Pramod Madhav♠️ (@PramodMadhav6) April 22, 2021
Also Read: కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్