Chapathi Making: ఆంటీ.. మీ ఐడియా సూపర్‌.! నిమిషంలో ఆరు చపాతీలు.

Chapathi Making: ఆంటీ.. మీ ఐడియా సూపర్‌.! నిమిషంలో ఆరు చపాతీలు.

Anil kumar poka

|

Updated on: Sep 24, 2024 | 9:43 PM

మహిళలు ఇంటి పనులు చేయడంలో కొందరు అతి తెలివిప్రదర్శిస్తే.. కొందరు స్మార్ట్‌ గా ఆలోచించి తక్కువ సమయంలో ఈజీగా పనులు చేసేసుకుంటారు. అంటాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ మహిళామణులను ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. చపాతీలు చేయడంలో సమయం ఆదా చేయడం కోసం ఆమె ఐడియా చూసి అంతా అవాక్కవుతున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ వంటింట్లో వంట చేయడానికి రెడీ అయింది. ఆమె చపాతీలు చేసేందుకు ముందుగానే పిండి రెడీ చేసుకొని పెట్టుకుంది. అయితే సాధారణంగా చపాతీలు చేయడానికి పిండి కలపడమే పెద్ద పని అనుకుంటే అవి వత్తడం మరో రిస్క్‌.. అయితే ఈ వీడియోలో మహిళ మాత్రం చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో దాదాపు 6 చపాతీలు చేసేసింది. అదెలా అంటే.. చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఒక పాల్థిన్‌ కవరు తీసుకుని దానిపైన ఓ పిండి ముద్ద ఉంచింది. దానిపైన మరో కవరు పెట్టింది.. దానిపైన ఇంకో చపాతీ పిండి ముద్ద ఉంచింది.. మళ్లీ దానిపై ఇంకో కవరు పెట్టింది. అలా ఓ చపాతీల వరకూ పేర్చి, ఆ తర్వాత అన్నింటినీ ఒకే సారి చెక్క పీటతో బలంగా ప్రెస్ చేసింది. తీసి చూడగా అన్ని ఉండలూ చపాతీలుగా మారాయి. ఆ తర్వాత వాటిని ఎంచక్కా.. పెనంపై వేసి చక్కగా కాల్చింది. ఇలా సమయం ఆదా చేస్తూ చపాతీలు చేసిన ఈమెను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ ఇలాంటి ఐడియాలు మాకు ఎప్పుడూ రాలేదే’’.. అంటూ కొందరు, ఆంటీ.. మీ ఐడియా సూపర్‌ అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.