Viral: యువతిని ముక్కలుగా నరికి.. ఆపై.! ఓర్నీ నువ్వేం మనిషివిరా..

చెన్నైలోని తురైపాకంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ముక్కలుగా నరికి సూట్‌ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ సూట్‌ కేసు విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సూట్‌ కేసు స్వాధీనం చేసుకొని ఓపెన్‌ చేయగా.. అందులో మహిళ డెడ్‌బాడీ ముక్కలు కనిపించాయి. దాంతో అందరూ షాకయ్యారు.

Viral: యువతిని ముక్కలుగా నరికి.. ఆపై.! ఓర్నీ నువ్వేం మనిషివిరా..

|

Updated on: Sep 24, 2024 | 9:38 PM

చెన్నైలోని తురైపాకంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ముక్కలుగా నరికి సూట్‌ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ సూట్‌ కేసు విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సూట్‌ కేసు స్వాధీనం చేసుకొని ఓపెన్‌ చేయగా.. అందులో మహిళ డెడ్‌బాడీ ముక్కలు కనిపించాయి. దాంతో అందరూ షాకయ్యారు.

చెన్నైలో మణికంఠన్‌ అనే వ్యక్తి కి మాధవరంకి చెందిన దీపతో పరిచయం ఏర్పడింది. మణికంఠన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. యువతి ఏం చేస్తున్నదీ సమాచారం లేదు. అయితే మణికంఠన్‌ దీపను మాట్లాడటానికి తురైపాక్కంలోని తన బంధువుల ఇంటికి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య ఏ కారణం చేతనో గొడవ మొదలైంది. ఈ క్రమంలో మణికంఠన్‌ దీపను కొట్టి ఏకంగా హత్యచేశాడు. అనంతరం ఆమె డెడ్‌బాడీని ముక్కలుగా చేసి సూట్‌ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. సూట్‌ కేసు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. సీసీ పుటేజీ ఆధారంగా కేసును ఛేధించిన పోలీసులు మణికంఠన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీప మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, మణికంఠన్‌, దీప మధ్య ఏం జరిగింది? ఎందుకు హత్య చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us