Viral: ఓ వైపు పూల వ్యాపారం.. మరోవైపు చిన్నారులకు పాఠాలు.. ఆకట్టుకుంటున్న వీడియో.
పిల్లలకు తల్లే మొదటి గురువు అని చెబుతారు. అది అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఈ ఘటన. ఓ మహిళ బ్రతుకు తెరువుకోసం పూలు అమ్ముతూ.. మరోవైపు తన బిడ్డకు బ్రతుకునిచ్చేందుకు గురువుగా మారి పాఠాలు చెబుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిల్లలను తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.పిల్లలకు తల్లే మొదటి గురువు అని చెబుతారు. అది అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఈ ఘటన.
పిల్లలకు తల్లే మొదటి గురువు అని చెబుతారు. అది అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఈ ఘటన. ఓ మహిళ బ్రతుకు తెరువుకోసం పూలు అమ్ముతూ.. మరోవైపు తన బిడ్డకు బ్రతుకునిచ్చేందుకు గురువుగా మారి పాఠాలు చెబుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిల్లలను తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ నిరుపేద మహిళ తోపుడుబండిపై పూలు అమ్ముకుంటోంది. మరోవైపు తన చిన్నారులను జాగ్రత్తగా చూసుకుంటోంది. బండి వెనుక భాగంలో ఓ సంచిలాంటిది పరిచి తన పిల్లలను కూర్చోబెట్టింది. ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. మరో పిల్లవాడితో ఆ తల్లి అక్షరాలు దిద్దిస్తోంది. ఓ వైపు బిజినెస్ చూసుకుంటూ.. మరోవైపు క్షణం ఖాళీ దొరికినా పిల్లవాడికి చదువు నేర్పుతోంది. ఈ ఘటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ తల్లి ఓర్పుకు సలాం అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..