Bengaluru: ఆఫీసుకు వెళుతుండగా ఇస్రో సైంటిస్టుపై యువకుడి దాడి.. వీడియో వైరల్.
బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీతో కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్ లంబా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీతో కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్ లంబా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళుతుండగా స్కూటీపై ఓ యువకుడు రెక్ లెస్ గా ప్రయాణిస్తూ తన కారును అడ్డగించాడని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కారును తన్నుతూ దాడికి యత్నించాడని ఆరోపించారు. కారులో తనతో పాటు తన కొలీగ్స్ కూడా ఉన్నారని చెప్పారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. సైంటిస్టుపై దాడికి ప్రయత్నించిన యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వివరించారు. వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిశ్ లంబాను రిక్వెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!

