Snake Hulchul: కోల్ కతా ఎయిర్ పోర్ట్‌లో పాము కలకలం రేపింది. ఇండిగో విమానం బ్యాగేజీలో హల్ చల్ చేస్తూ సిబ్బందిని కంగారు పెట్టింది. సదరు ఇండిగో ఫ్లైట్ రాయపూర్ నుండి కోల్‌కతాకు వచ్చింది. ఆ విమానం కోల్‌కతా నుండి ముంబైకి తిరిగి వెళ్లాల్సి ఉంది. దీంతో. ప్రయాణీకుల లగేజీని విమానం లోపలకు ఎక్కించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రన్ వే మీద నుంచి జరజరా ఒక పాము పాకుకుంటూ లగేజ్ స్టాండ్ మీదకు ఎక్కింది. అక్కడి నుంచి బ్యాగేజీలోకి పాకింది.
పామును చూసిన వెంటనే విమానాశ్రయ ఉద్యోగి ప్లైట్ లోని బ్యాగేజీలోకి ఎక్కిన పామును సాహసోపేతంగా చేతితో కిందకి లాగి పడేశాడు. సమాచారం అటవీ శాఖకు చేరవేయడంతో కొద్దిసేపటి తర్వాత అటవీ శాఖ సిబ్బంది ఎయిర్ పోర్ట్‌కు వచ్చి పామును తీసుకెళ్లారు. కాగా, సదరు విమానాశ్రయం యొక్క రన్‌వే చుట్టూ పాములు కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ విధంగా పాములు విమానాశ్రయంలోకి ప్రవేశించడం బహుఅరుదు అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు.
Read also: Kadapa Double Murders Story: కడప జిల్లా డి నేలటూరు డబుల్ మర్డర్స్ కేసులో విస్తుపోయే విషయాలు.!