Viral Video: స్విమ్మింగ్లో తాబేలుతో పోటీ కి సై అంటున్న కుందేలు…సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Viral Video: మనందరికి కుందేలు.. తాబేలు కథ తెలిసిందే. అందులో రెండు పరుగు పోటీ పెట్టుకుంటాయి.
Viral Video: మనందరికి కుందేలు.. తాబేలు కథ తెలిసిందే. అందులో రెండు పరుగు పోటీ పెట్టుకుంటాయి. ఎవరు ముందు వస్తారో వాళ్ళే విన్నర్ అనుకుంటాయి. అయితే అనుకున్నాట్టుగానే కుందేలు ముందు పరిగెడుతుంది. తాబేలు వెనకలా మెల్లగా వస్తుంది. అయితే తాబేలు రాకను గమనించిన కుందేలు ఆ.. అది మన దగ్గరకు వచ్చేసరికి వెళ్లొచ్చులే.. ’అని పక్కన పడుకుంటుంది. కానీ తాబేలు మాత్రం మెల్లగా వచ్చినా.. పరుగు పందెంలో గెలుస్తుంది. ఎంటీ ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పనా అని ఆలోచిస్తున్నారా ? తాబేలు నివసించేది నీటిలో. కానీ అది భూమిపై కూడా బ్రతగలుగుతుంది. కానీ కుందేలు అలా కాదు. కేవలం భూమి మీద మాత్రమే బ్రతకగలుకుంది. మరీ ఇవీ రెండు పోటీ పెట్టుకున్నాయి కూడా భూమి మీదనే. అయితే ఈ కథ ఆ కుందేలుకు కూడా తెలుసేమో. భూమీ పై తమ జాతికి చెందిన కుందేలును ఓడించిన తాబేలుపై ఎలాగైనా గెలవాలనుకుందేమో. కానీ ఈసారి పోటీ భూమీ కాకుండా.. తాబేలు ఉండే నీటిలో అనుకున్నట్టుగా ఉంది. అందుకో కాబోలు.. తాబేలుతో పోటీ పడేందుకు స్వీమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవతుంది.
ఆ వీడియోలో.. ఒక కాలువ దగ్గరకు వెళ్ళిన కుందేలు కాసేపు దానిని అలానే చూస్తూ ఉండిపోయింది. ఇక మెల్లగా జంప్ చేస్తూ.. ఆ కాలువలోకి వెళ్ళి స్వీమ్మింగ్ మొదలు పెట్టంది. కానీ కాలువ మధ్యకు వెల్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీరానికి వచ్చేసింది. అన్ని నీళ్ళలో వెళ్ళేసరికి భయపడిందేమో. కుందేలు స్వీమ్ చేయడాన్ని అక్కడే ఉన్న ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.
వీడియో..
They can swim.. pic.twitter.com/smwsLEJWbX
— Buitengebieden (@buitengebieden_) April 21, 2021
Also Read: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…
Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..