Lion On Road: నడిరోడ్డుపై జనాల మధ్య వీధుల్లో దర్జాగా తిరుగుతున్న సింహం.. వీడియో వైరల్.
అడవిలో ఉండే క్రూరమృగాలు సైతం సింహం కనబడితే పరుగు లంకించుకుంటాయి. అలాంటిది నగరంలోని పట్టపగలు వాహనాలు అటూఇటూ తిరుగుతూ రద్దీగా ఉండే బిజీ రోడ్లపై సింహం స్వైర విహారం చేస్తుంది. జనాల్లో కలిసిపోయి చాలా సాధారణంగా తిరిగేస్తోంది. అది చూసి జనాలుకూడా అదేదో వీధి కుక్క అన్నట్టుగా ఏమాత్రం భయపడకుండా తిరుగుతున్నారు జనాలు.
అడవిలో ఉండే క్రూరమృగాలు సైతం సింహం కనబడితే పరుగు లంకించుకుంటాయి. అలాంటిది నగరంలోని పట్టపగలు వాహనాలు అటూఇటూ తిరుగుతూ రద్దీగా ఉండే బిజీ రోడ్లపై సింహం స్వైర విహారం చేస్తుంది. జనాల్లో కలిసిపోయి చాలా సాధారణంగా తిరిగేస్తోంది. అది చూసి జనాలుకూడా అదేదో వీధి కుక్క అన్నట్టుగా ఏమాత్రం భయపడకుండా తిరుగుతున్నారు జనాలు. ఈ విచిత్ర సంఘటన పాకిస్థాన్‌లోని కరాచిలో చోటుచేసుకుంది. కరాచీలో రద్దీగా ఉన్న షరియా ఫైసల్ నగర రోడ్లపై ఊహించని విధంగా సింహం ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై సింహం దర్జాగా నడుచుకుంటూ షికారు చేసింది. కొంతమంది బాటసారులు సింహాన్ని గమనించకుండా దానికి దారిచ్చి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు. కాసేపటికి కొందరు గమనించి సింహాన్ని చూసేందుకు గుంపులుగా గుమిగూడారు. నగరంలోని ఆయేషా బవానీ కాలేజీ సమీపంలోని ఓ బిల్డింగ్ పార్కింగ్ వద్దకు సింహం చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సింహాన్ని బంధించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో తరలిస్తుండగా సింహం పొరపాటున రోడ్లపైకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గంటపాటు శ్రమించి సింహాన్ని రక్షించారు. దాన్ని తరలిస్తోన్న వాహనం డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణుల చట్టాల ప్రకారం నివాస ప్రాంతాల్లో సింహాలను వదిలడం చట్టరిత్యా నేరం అని కన్జర్వేటర్ సింధ్ వన్యప్రాణి విభాగం జావేద్ మెహర్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..