Fire Accident: గాఢ నిద్రలో ఉండగానే ఘోరం.. 52మంది సజీవదహనం..! వీడియో.
ఐదు అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అత్యంత ఘోరమైన ఘటనలో 52 మంది ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్ననట్లు అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది భారీగా ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.
ఐదు అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అత్యంత ఘోరమైన ఘటనలో 52 మంది ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్ననట్లు అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది భారీగా ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జొహన్నెస్‌బర్గ్ నగరంలోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఓ ఐదు అంతస్థుల భవనంలో ఈ తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వారు అగ్నికి ఆహుతి అయ్యారు. మరికొంత మంది కాలిన గాయాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో 52 మంది సజీవ దహనం అయినట్లు అధికారులు గుర్తించారు. మరో 50 మందికి పైగా ఈ ఘటనలో గాయపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే మంటలు తగ్గి భవనమంతా దట్టమైన పొగలు అలుముకొని సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో ఆ భవనంలో 200 మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..