Rare Snake: 200 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చిన అరుదైన పాము.. వీడియో.
మహబూబ్‌నగర్‌నగర్ జిల్లాలో ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. దాదాపు 200 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పాము కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు.
మహబూబ్‌నగర్‌నగర్ జిల్లాలో ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. దాదాపు 200 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పాము కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు. ఆయన బయోలజి ఉపాధ్యాయు డు దేవిలాల్‌కు చెప్పడంతో ఆయన వెళ్లి పామును పట్టుకుని ఫొటోలను సదాశివయ్యకు పంపించారు. పట్టుకున్న పాము అరుదైనదిగా గుర్తించారు. విషరహిత పాము కావటం వల్ల దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేయాలని సూచించటంతో దేవిలాల్ దానిని గుట్టపై ఉన్న అటవీప్రాంతంలో వదిలేశారు. నల్లటిరంగులో తెల్లటి పట్టీలు కలిగి అందంగా కనిపించే ఈ పాము డ్రయోకలామస్ నింఫా అని పిలువబడే కోలుబ్రీడే కుటుంబానికి చెందినదిగా వివరించారు. సదాశివయ్య వివరించారు. 50 సెంటీమీటర్ల పొడవు పెరిగే ఈ పామును మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరు సమీపంలో 1803లో గుర్తించారని తెలిపారు. దీనిమెడపైన ఉన్న తెల్లని మచ్చ పెళ్లికూతురు మెడమీద ఉన్న ఓణిలా ఉండటం మూలాన వెల్లూర్ బ్రైడల్ స్నేక్ అని పిలుస్తారన్నారు. ఎలాంటి గోడలైనా ఈ పాము సునాయాసంగా ఎక్కగలదని, ఎలుకలు, బల్లులు వీటి ప్రధాన ఆహారమని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..