Leopard Viral: చెట్లు ఎక్కడమే కాదు, దిగడమూ తెలుసంటున్న చిరుత.. ఇది చిరుత కాదు.. మహా ముదురు..
సోషల్‌మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా చూస్తారు. షేర్స్, కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తారు. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్‌మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా చూస్తారు. షేర్స్, కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తారు. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత వేట గురించి అందరికీ తెలిసిందే. ఎరని పట్టుకోవడంలో దీనిని మించిన జంతువు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే మన పెద్దలు ఒక సామెత చెబుతుండేవారు.. పిల్లి.. పులికి చెట్టు ఎక్కడం నేర్పింది కానీ.. దిగడం ఎలాగో నేర్పించలేదు అని. కానీ ఈ చిరుత మాత్రం “నువ్వు నేర్పకపోతే నేను దిగలేనా” అని సవాలు చేస్తున్నట్టుంది ఈ వీడియో చూస్తే…ఈ షాకింగ్ వీడియోలో ఒక చెరకు తోట కనిపిస్తుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి. అక్కడే ఒక ఎత్తయిన చెట్టు ఉంది. దానిపైన ఓ చిరుతపులి వేట కోసం మాటువేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలాసేపు చూసి చూసి ఏది కనిపించకపోయేసరికి కిందికి దిగుతుంది. అయితే అది చెట్టుదిగే పద్దతి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఒక మనిషి ఏ విధంగా చెట్టు దిగుతాడో చిరుత కూడా అలాగే దిగుతుంది. చిరుతపులి చెట్లు ఎక్కడంలో చాలా ఎక్సపర్ట్ అని చెప్పవచ్చు. మిగతా వేటాడే జంతువులకి దీనికి తేడా ఇదే. అందుకే దీని కంటపడితే ఏ జంతువైనా ఆహారం కావాల్సిందే. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రమేష్ పాండే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “ఈ చిరుత మహా ముదురు” అని కొందరంటే.. వీధి కుక్కలకు భయపడి చెట్టుపైకి ఎక్కి ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..