Huge Whale: మత్స్యకారుల వలలో భారీ తిమింగలం.. ఏం చేశారో తెలుసా.?

Huge Whale: మత్స్యకారుల వలలో భారీ తిమింగలం.. ఏం చేశారో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Apr 15, 2024 | 11:15 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెంలో మత్స్యకారులను ఒక తిమింగలం షాక్ కు గురిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. సమీప పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మత్స్యకారులు తీరంలో చేపల వేట చేస్తున్న నేపథ్యంలో వల లాగుతుండగా చాలా బరువుగా అనిపించింది. దాంతో వాళ్ళలో తెలియని ఆనందం, ఆందోళన రెండూ ఒకేసారి కలిగాయి.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెంలో మత్స్యకారులను ఒక తిమింగలం షాక్ కు గురిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. సమీప పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మత్స్యకారులు తీరంలో చేపల వేట చేస్తున్న నేపథ్యంలో వల లాగుతుండగా చాలా బరువుగా అనిపించింది. దాంతో వాళ్ళలో తెలియని ఆనందం, ఆందోళన రెండూ ఒకేసారి కలిగాయి. పెద్దఎత్తున చేపలు పడ్డాయనుకొన్న ఆనందంతో వలను అతి కష్టం మీద తీరానికి లాక్కొని వచ్చారు. తీరా చూస్తే అందులో ఒక భారీ తిమింగలం కనిపించింది. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు తిమింగలాన్ని చూసి మత్స్యకారులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని ధైర్యం చేసి దాన్ని పరిశీలించగా, అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. తిరిగి సముద్రంలోకి పంపేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది వెళ్ళలేక పోయింది దీంతో అక్కడే వదిలేశారు. తిమింగలం అక్కడే చనిపోతే రోజుల తరబడి వచ్చే దుర్వాసన భరించలేమని, వేటకు కూడా వెళ్ళలేమని వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

ఇటీవల పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో పలు సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు చేరుతున్నాయి. ఇటీవల భారీ సైజ్ లో ఉండే సముద్రపు తాబేళ్లు, కొన్ని సందర్భాలలో చేపలు చనిపోయి తీరం వెంబడి కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ సమీపంలోని సెజ్ తో పాటు ఫార్మా కు చెందిన కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేస్తుండటమే కారణంగా పలువురు మత్స్యకారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్యం వల్లనే గతంలోనూ చిన్నచిన్న తిమింగలాలు కూడా చనిపోయి తీరానికి చేరాయని వారు గుర్తు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..