Odisha Police: టాటూ పార్లర్‌ల బయట పోలీసుల క్యూ.. ఎందుకంటే?

పచ్చబొట్లు పొడిపించుకున్న ఒడిశా స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌ పోలీసులు వెంటనే వాటిని తొలగించుకోవాలని పోలీస్‌ శాఖ ఆదేశించింది. అందుకు తక్కువ గడువు పెట్టడంతో టాటూ పార్లర్‌ల వద్ద పోలీసులు క్యూ కట్టారు. ఉన పళంగా పచ్చబొట్లను తొలగించాలని ఆదేశించడానికి గల కారణాలను డీఎస్పీ సుధాకర్‌ మిశ్రా వివరించారు. రాష్ట్రంలో చాలామంది స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసులు యూనిఫాం బయట పచ్చబొట్లు వేయించుకున్నారనీ సిబ్బంది

Odisha Police: టాటూ పార్లర్‌ల బయట పోలీసుల క్యూ.. ఎందుకంటే?

|

Updated on: Apr 15, 2024 | 8:20 AM

పచ్చబొట్లు పొడిపించుకున్న ఒడిశా స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌ పోలీసులు వెంటనే వాటిని తొలగించుకోవాలని పోలీస్‌ శాఖ ఆదేశించింది. అందుకు తక్కువ గడువు పెట్టడంతో టాటూ పార్లర్‌ల వద్ద పోలీసులు క్యూ కట్టారు. ఉన పళంగా పచ్చబొట్లను తొలగించాలని ఆదేశించడానికి గల కారణాలను డీఎస్పీ సుధాకర్‌ మిశ్రా వివరించారు. రాష్ట్రంలో చాలామంది స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసులు యూనిఫాం బయట పచ్చబొట్లు వేయించుకున్నారనీ సిబ్బంది టాటూ వేయించుకోవడం పరిశీలకుల దృష్టిలో చెడు అభిప్రాయం ఏర్పరిచే అవకాశం ఉందని అన్నారు. ఇది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ఎదుట ఒడిశా పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తుందనీ అందుకే ఈ ఆదేశాలు జారీ చేశామని అన్నారు. టాటూల తొలగింపుకి 15 నుంచి 20 రోజుల గడువు విధించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో స్పెషల్ బెటాలియన్‌ పోలీసులు కనీసం 1,000 మంది ఉంటారు. డిపార్ట్ మెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు టాటూ పార్లర్‌లకు క్యూ కట్టారు. పచ్చబొట్టు వేయించుకునే ప్రక్రియ కంటే.. వాటిని తొలగించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వీటిని సమూలంగా తొలగించాలంటే లేజర్‌ చికిత్స అవసరం. 20 రోజుల వ్యవధిలో నాలుగు సెషన్లలో వీటిని తొలగిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us