Floating House: 12 కోట్లతో నీళ్లలో తేలే ఇల్లు.. కానీ కొబ్బరికాయ కొట్టిన రోజే మునిగిపోయింది..!(వీడియో)
2 కోట్లు పెట్టి కట్టిన నీళ్లలో తేలే ఇల్లు.. లాంచింగ్ రోజే మునిగిపోయింది.. భారీగా డబ్బు ఖర్చు పెట్టి నీళ్లలో తేలియాడే భవనం కట్టించుకుంటే.. అది లాంచ్ చేసిన రోజే నీళ్లలో మునిగిపోతే ఎలా ఉంటుంది?
పనామా అనే కంపెనీకి అలాంటి అనుభవమే ఎదురైంది. ‘సీపాడ్’ పేరిట ఆ కంపెనీ ఒక భవనాన్ని తయారు చేసింది. ఇది నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది. సుమారు 300 గజాల విస్త్రీర్ణంలో లివింగ్ రూం ఉంటుంది.ఇది కాకుండా దీనికి కొంచెం దూరంగా నీటి మట్టానికి 7.5 అడుగుల ఎత్తులో మూడు హాఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. దీని నిర్మాణానికి 1.5 మిలియన్ డాలర్లు, మన లెక్కల్లో 12 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చయిందట. దీన్ని లాంచ్ చేసే కార్యక్రమానికి పనామా కంపెనీ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. అప్పటికే కొన్ని రోజులుగా ఆ నీళ్లలో ఉన్న ఈ సీపాడ్.. అందరూ చూస్తుండగానే అలా ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడకు వచ్చిన చాలా మంది భయపడిపోయారు.దీనిపై పనామా కంపెనీ వివరణ ఇచ్చింది. ‘సీపాడ్‌లోని బాలాస్ట్ ట్యాంక్, పంపింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య కారణంగా జాకూజీ స్పా లో నీళ్లు చేరాయి. దీని వల్లనే సీపాడ్ ఇలా ఒరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కనీసం ఎవరి కాళ్లు కూడా తడవలేదు’ అని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

