Car Accident: సైకిల్ ను ఢీ కొట్టి.. వ్యక్తిని 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. సీసీ కెమెరాలో రికార్డు అయినా వీడియో..
సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతను కారు కింది భాగంలో చిక్కుకున్నాడు. అయినా కారు ఆపకుండా అలాగే 8 కిలోమీటర్లు లాక్కెళ్లి.. కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు.
మోతిహారి ప్రాంతానికి చెందిన శంకర్.. సైకిల్పై వెళుతున్నాడు. ఆ సమయంలో గోపాల్గంజ్వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చింది. స్పీడ్ గా వచ్చి సైకిల్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్.. కారు కింద ఇరుక్కున్నాడు. అయినా.. కారు ఆపకుండా అలాగే లాక్కెళ్లిపోయాడు డ్రైవర్. అలా శంకర్ ను 8 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో శంకర్ మృతి చెందాడు. కొత్వాలోని కదమ్ చౌక్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత కారు డ్రైవర్, అందులో ఉన్న వారు కారును ఆపి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ రహదారి పక్కన ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..