Hen Fight With Snake: అమ్మ ప్రేమ కు ఏదీ సాటి రాదు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఇంకా కల్తీ కానిది ఏమైనా ఉందంటే అది కన్నతల్లి ప్రేమ ఒక్కటే.. మాతృత్వంలోని ప్రేమకు ఎవరూ అతీతులు కారు. జంతువులు, పక్షులు, మనుసులు ఎవరైనా సరే తల్లి ప్రేమను పంచడం లో ఎక్కడ బేధం ఉండదు.
అమ్మ తన పిల్లల క్షేమం కోసం తన సుఖసంతోషాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తుంది. అమ్మ ప్రేమకు జంతువులు కూడా అతీతం కాదు.. తమ పిల్లల కోసం.. వాటిని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం అడ్డేసిన సంఘటన అనేకం చూసాం.. తాజాగా ఈ సృష్టిలో తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని.. పవిత్రమైన అమ్మ ప్రేమ ఎంత వైలువైందో…నిరూపించింది కోడి..
తన పిల్లలను తినడానికి వస్తున్న పాముని చూసింది తల్లి కోడి.. అంటే ఆ పాము తన పిల్లల దగ్గరకు చేరుకోకుండా తన ప్రాణాలను అడ్డేసి.. మరీ పాముతో పోరాడింది.. కాళ్లతో తన్నుతూ.. ముక్కుతో పొడుస్తూ.. ఆ పాముని అడ్డుకుంది.. తన పిల్లలని రక్షించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తినడానికి చూస్తే ఖాళీ గిన్నె దర్శనం. యజమానిమీద కోపంతో శునకం చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరుగా