Cruise Ship: గర్భిణీ సహా 8 మందిని సముద్రం మధ్యలో దీవిలోనే వదిలేసి వచ్చిన షిప్.. ఎందుకంటే..!

దీవిలో తిరుగుతూ ఆలస్యంగా తిరిగొచ్చారని ఓ షిప్ కెప్టెన్ టూరిస్టులను సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవిలోనే వదిలేసి వెళ్లిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. సదరు పర్యాటకులు తీరానికి చేరుకున్నపుడు షిప్ ఇంకా అక్కడే ఉన్నా సరే.. వాళ్లను లోపలికి అనుమతించకుండా బయలుదేరడంతో నార్వేజియన్ క్రూయిజ్ షిప్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Cruise Ship: గర్భిణీ సహా 8 మందిని సముద్రం మధ్యలో దీవిలోనే వదిలేసి వచ్చిన షిప్.. ఎందుకంటే..!

|

Updated on: Apr 04, 2024 | 9:20 PM

దీవిలో తిరుగుతూ ఆలస్యంగా తిరిగొచ్చారని ఓ షిప్ కెప్టెన్ టూరిస్టులను సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవిలోనే వదిలేసి వెళ్లిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. సదరు పర్యాటకులు తీరానికి చేరుకున్నపుడు షిప్ ఇంకా అక్కడే ఉన్నా సరే.. వాళ్లను లోపలికి అనుమతించకుండా బయలుదేరడంతో నార్వేజియన్ క్రూయిజ్ షిప్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీవిలోనే వదిలేసిన పర్యాటకులలో ఓ గర్భిణీతో పాటు హృద్రోగ బాధితుడైన ఓ వృద్ధుడు సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అమెరికాకు చెందిన నలుగురితో పాటు వివిధ దేశాలకు చెందిన టూరిస్టులతో నార్వేజియన్ క్రూయిజ్ షిప్ ఒకటి ఆఫ్రికన్ ఐలాండ్ టూర్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ షిప్ మార్చి 27న సావో టోమ్ అనే దీవికి చేరుకుంది. దీవిని సందర్శించి నిర్ణీత సమయంలోగా షిప్ ను చేరుకోవాలంటూ ప్రయాణికులకు కెప్టెన్ సూచనలు చేశాడు. తీరానికి సమీపంలో లంగరు వేసిన షిప్ లో నుంచి చిన్న చిన్న బోట్ లలో పర్యాటకులు దీవిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది పర్యాటకుల గ్రూపు ఒకటి తిరిగి షిప్ ను చేరుకోవడంలో ఆలస్యమైంది. అప్పటికి షిప్ బయలుదేరకున్నా కూడా ఆ పర్యాటకులను షిప్ లోకి ఎక్కేందుకు కెప్టెన్ అనుమతించలేదు.

చెప్పిన సమయంలోగా రాలేదని వారిని అక్కడే వదిలేసి వెళ్లాడు. షిప్ లో ఉన్న వారి బ్యాగులు, పర్స్ లు ఇతర సామాన్లను తీసుకోవడానికి కూడా అనుమతించలేదు. దీంతో కోస్ట్ గార్డ్ సాయంతో తీరం చేరుకున్న పర్యాటకులు.. తిరిగి తమ షిప్ ను చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆ షిప్ సెనెగల్ చేరుకుంటుంది. ఈ ఘటనపై పర్యాటకులు తీవ్రంగా మండిపడుతున్నారు. టూర్ కు తీసుకెళ్లిన పర్యాటకులను అలా సముద్రం మధ్యలో వదిలేయడమేంటని ప్రశ్నస్తున్నారు. వారు తిరిగొచ్చిన సమయానికి షిప్ ఇంకా బయలుదేరకపోయినా కూడా లోపలికి అనుమతించకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!