Viral Video: ఓ మై గాడ్.. ఇది చెట్టు రా బాబు.. ఏకంగా నీళ్ల వరదే పారిస్తోంది.. షాకవుతోన్న జనాలు.. వైరల్ వీడియో

ఒక గ్రామంలో ఓ వింత చెట్టు ఉంది. దాని కాండం నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. స్థానికులు ఈ చెట్టును దేవుడిచ్చిన వరం అంటున్నారు.

Viral Video: ఓ మై గాడ్.. ఇది చెట్టు రా బాబు.. ఏకంగా నీళ్ల వరదే పారిస్తోంది.. షాకవుతోన్న జనాలు.. వైరల్ వీడియో
Viral Video Water From Tree
Venkata Chari

|

Apr 26, 2022 | 6:55 AM

మన విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అప్పుడుప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరెన్నో వెలుగుచూస్తున్నాయి. ఎక్కడ ఏ వింత చోటుచేసుకున్నా.. బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటుంటాం. అయితే, ప్రస్తుతం ఓ చెట్టు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి షాకవుతారు. 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు రహస్యంగా బయటకు వస్తుంది. ఈ చెట్టు మల్బరీకి చెందినది. ఈ అద్భుతమైన దృశ్యం శీతాకాలం చివరిలో లేదా భారీ వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. భూమి నుంచి సుమారు 1.5 మీటర్ల ఎత్తులో చెట్టు ట్రంక్ నుంచి నీరు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ నీరు ఇలా కారడంతో, ఆ ప్రాంతంలో చిన్నపాటి కొలను ఏర్పడుతుంది. స్థానికులు ఈ సంఘటనను భగవంతుడు లేదా ప్రకృతి ప్రసాదించినదిగా భావిస్తుంటారు.

ఈ ప్రత్యేకమైన చెట్టు మాంటెనెగ్రో దేశంలోని డైనోసా గ్రామంలో ఉంది. యూరోన్యూస్ నివేదిక ప్రకారం, 20 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ చెట్టు నుంచి నీరు రావడం కనిపించింది. ఇది ఇప్పటికీ నిర్దిష్ట సీజన్‌లో కనిపిస్తూనే ఉంది. అయితే, చెట్టు నుంచి నీరు రావడం ప్రారంభించిన తర్వాత, అది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ చెట్టు ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే దాని నుంచి నీరు వచ్చినప్పుడల్లా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, మీడియా, ఇతర వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూడటానికి చేరుకుంటారు.

బీబీసీతో స్థానిక నివాసి ఎనిర్ హక్రామాజ్ మాట్లాడుతూ, ఈ చెట్టు కింద నీటి వనరు ఉంది. చెట్టు కాండం ద్వారా నీరు పైకి చేరుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని మనం చూడబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. నివేదిక ప్రకారం, మంచు కరగడం లేదా అధిక వర్షం కారణంగా, భూమిలోని నీటి మట్టం పెరుగుతుంది. పీడనం పెరగడం వల్ల, నీరు బోలు కాండంలో వేర్ల ద్వారా నిక్షిప్తం చేయబడి, ఇలా బయటకు రావడం జరగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొటున్నారు.

Also Read: గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

Viral Video: బుల్డోజర్ తో పగలకొట్టి ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘనుడు !!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu