విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్

మీరు వరదల్లో, వానల్లో తిరుగుతున్నారా.. జాగ్రత్త! సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బాక్టీరియా ఎప్పుడూ.. ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరదనీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు.. తన కాలును తీసేయడానికి కారణమైంది. ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు.

విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్

|

Updated on: Sep 27, 2024 | 11:10 AM

మీరు వరదల్లో, వానల్లో తిరుగుతున్నారా.. జాగ్రత్త! సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బాక్టీరియా ఎప్పుడూ.. ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరదనీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు.. తన కాలును తీసేయడానికి కారణమైంది. ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు. అయితే ఈ వరదలు ఓ బాలుడి కాలును తినేశాయి. అవును.. వరదనీటి ద్వారా సోకిన బాక్టీరియా ఓ బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. అసలు అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. మరి బ్యాక్టీరియాలా ఎలా ప్రవేశించింది? వైద్యులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన ఇది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్‌ కుటుంబం ఈ నెల మొదట్లో వరదలో చిక్కుకుంది. వరదనీరు తగ్గే వరకు భవదీప్‌ నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు. ఆ రాత్రి వణుకు, చలి జ్వరం వచ్చిన తర్వాత, స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. కానీ, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ అని గుర్తించి చికిత్స అందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్

TOP 9 ET News: ఇది ఆల్ టైం రికార్డ్‌ !! జయహో దేవర

Follow us