Watch Video: శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భక్తుడు..
తిరుమలలో ఒక భక్తుడి నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది విచారించడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులతో లక్కి డిప్ విధానంలో పాల్గొంటూ వచ్చాడు బెంగళూరుకు చెందిన శ్రీధర్. ఈసారి అడ్డంగా బుక్ అయ్యాడు. శ్రీధర్‌పై కన్నేసిన విజిలెన్స్ అధికారులు ఫేక్ ఆధార్‌తో సేవా టిక్కెట్ పొందినట్లు గురించారు.
తిరుమలలో ఒక భక్తుడి నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది విచారించడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులతో లక్కి డిప్ విధానంలో పాల్గొంటూ వచ్చాడు బెంగళూరుకు చెందిన శ్రీధర్. ఈసారి అడ్డంగా బుక్ అయ్యాడు. శ్రీధర్‌పై కన్నేసిన విజిలెన్స్ అధికారులు ఫేక్ ఆధార్‌తో సేవా టిక్కెట్ పొందినట్లు గురించారు. లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్స్ పోందేందుకు దాదాపు 400 సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి దాకా 20 సార్లు లక్కి డిప్ విధానంలో సుప్రభాత సేవా టిక్కెట్ పోందిన శ్రీధర్ తాజాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి ఎంట్రీ కాగానే దొరికిపోయాడు. ఈ రోజు సుప్రభాత సేవకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీవారి సేవలో పాల్గొనకుండానే పోలీను స్టేషన్‌కు తరలించారు. సిస్టమ్‌లోని లోపాలు ఆసరాగా చేసుకుని అతి తెలివి తేటలు ప్రదర్శించిన ఇతనిని విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుమల 1 టౌన్ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..