తాటి కల్లుతో బెల్లం తయారీ..ఎలా తయారు చేస్తారో తెలుసా?
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం కల్లిఫలం.. తాటి కల్లుతో బెల్లం తయారీకి పెట్టింది పేరు. కల్లిఫలం గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కాపాడుకుంటూ నేటికి అక్కడి కల్లు గీత కార్మికులు కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. తాటి కల్లును ఒక పద్దతిలో సేకరించి దాన్ని నిల్వ ఉంచి నీరా తయారు చేస్తారు. మొదట కల్లు కుండకి నత్త గుల్ల పెంకుతో తయారు చేసిన సున్నాన్ని పూస్తారు. కల్లు దానిలో పడటంతో రుచి మారకుండా ఉండేందుకు ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత అలా సేకరించిన కల్లును ప్రత్యేక పద్దతిలో తేనేలా మారేలా నిల్వ ఉంచుతారు.
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం కల్లిఫలం.. తాటి కల్లుతో బెల్లం తయారీకి పెట్టింది పేరు. కల్లిఫలం గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కాపాడుకుంటూ నేటికి అక్కడి కల్లు గీత కార్మికులు కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. తాటి కల్లును ఒక పద్దతిలో సేకరించి దాన్ని నిల్వ ఉంచి నీరా తయారు చేస్తారు. మొదట కల్లు కుండకి నత్త గుల్ల పెంకుతో తయారు చేసిన సున్నాన్ని పూస్తారు. కల్లు దానిలో పడటంతో రుచి మారకుండా ఉండేందుకు ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత అలా సేకరించిన కల్లును ప్రత్యేక పద్దతిలో తేనేలా మారేలా నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత నీరాను రెండున్నర గంటల పాటు ఉడికించి బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని కావాల్సిన అచ్చులో పోసుకొని బెల్లం తయారు చేస్తారు. ఈ పద్దతి ఎక్కడా కెమికల్స్ కలపడం కాని కృత్రిమ రంగులు కలపడం కాని ఉండదు. సహజ సిద్దంగా వచ్చే కల్లును ప్రత్యేక పద్దతుల్లో సేకరించి ఉడికించి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బెల్లాన్ని కేజీ 350 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే కల్లు లీటర్ యాభై రూపాయలకు విక్రయిస్తున్నారని పది లీటర్ల కల్లుతో ఒక కేజీ బెల్లం తయారవుతుందని తయారీదారులు తెలిపారు. కల్లుగా అమ్మగా ఐదు వందల రూపాయలు వస్తుంటే బెల్లం తయారు చేసి విక్రయిస్తే మూడు వందల యాభై రూపాయలే వస్తుందని తెలిపారు. గ్రామంలో అనేక మంది తాటి కల్లుతో బెల్లం తయారు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
