Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య
ఆన్ స్క్రీన్ పై హీరోయిజం చూపించడం.. తూటాళ్లాంటి డైలాగులు పేల్చడమే కాదు.. ఆఫ్ స్క్రీన్లో సాయం కోరిన అభిమానులకు అండగా ఉండడంలోనూ బాలయ్య లయన్ అనే అనిపించుకుంటారు. తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేశారు.
ఇటీవల తన అభిమాని ఒకరు అనారోగ్యానికి గురైతే.. బాలయ్య చొరవ తీసుకుని మరీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి స్వామి అనే వ్యక్తి.. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. ఇటీవల కాలంలో బద్రి స్వామి అనారోగ్యానికి గురయ్యాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునేందుకు అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తన అభిమాని బద్రి స్వామికి చికిత్స అందించేందుకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అతడికి 10 లక్షల రూపాయలు అందేలా చొరవ చూపారు. చికిత్సకు 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేక బద్రి స్వామి ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని ఆదోని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు బాలయ్య దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన బాలకృష్ణ ప్రభుత్వం ద్వారా 10 లక్షలు LOC మంజూరు చేయించారు. సంబంధిత మంజూరు పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర బద్రికి అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆదోని అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. మా బాలయ్యది బంగారంలాంటి మనసు అంటూ.. చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాసేపట్లో అంత్యక్రియలు.. దగ్గుతూ లేచి కూర్చున్న మృత దేహం
వీధి కుక్క దాదాగిరీకి నెటిజన్లు ఫిదా
ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్‌కు బయలుదేరిన భగీరా.. వీడియో చూస్తే షేకే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

