AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధి కుక్క దాదాగిరీకి నెటిజన్లు ఫిదా

వీధి కుక్క దాదాగిరీకి నెటిజన్లు ఫిదా

Phani CH
|

Updated on: Jul 25, 2025 | 1:27 PM

Share

రోడ్డుమీద పాద చారులకు, వాహనదారులకు వీధి కుక్కలు ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మూకుమ్మడిగా మీదపడి దాడి చేస్తాయి. ఇటీవల అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్స్‌కు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వీడియోలో, ‘లంబోర్గిని ముందు ఓ వీధి కుక్క దాదాగిరి చేస్తుండటాన్ని చూసి నెటిజన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు. ముంబైలోని వత్సల దేశాయ్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. అక్కడి రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఆ తర్వాత ఓ ఆరెంజ్ కలర్‌ లంబోర్గిని కారు వచ్చింది. దాని ముందు కార్లను ఓవర్ టేక్ చేయాలని ఆ కారు డ్రైవర్ ప్రయత్నించాడు. అంతే.. ఒక కుక్క ఆ లంబోర్గిని కారుకు ఎదురుగా నిలబడి.. అరుస్తూ ఆ కారు ముందుకు రాకుండా కట్టడి చేసింది. కుక్కను తప్పించుకొని కారును ముందుకు తీసుకుపోవటానికి డ్రైవర్ నానా తిప్పలు పడినా.. ఆ కుక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు.. ఆ కుక్కను ఏమార్చి రెప్పపాటులో ఆ డ్రైవర్ ఆ కారును ముందుకు దూకించాడు. కానీ, ఆ వీధి చివరి వరకు ఆ కుక్క ఆ కారును వెంబడిస్తూ వెళ్లింది. దీంతో ఆ కుక్క దాదాగిరిని చూసి అక్కడి జనం అంతా ఆశ్చర్యపోయారు. ఈ సీన్ అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కావటంతో.. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గత జన్మలో ఈ కుక్క.. ముంబైలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చని కొందరు.. నోరు లేకపోయినా.. డిసిప్లిన్ ఉన్న కుక్క అని మరికొందరు నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్‌కు బయలుదేరిన భగీరా.. వీడియో చూస్తే షేకే

రూ.4.3 కోట్ల కారు కొని… ఇంట్లో వేలాడదీశాడు

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..

జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?