AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

Phani CH
|

Updated on: Jul 25, 2025 | 1:09 PM

Share

పాత భవనాన్ని కూలగొట్టినప్పుడు బయటపడిన పునాది రాయిలా ఉంది కదూ. నిజానికి ఇది ఇక్కడి రాయి కాదు. అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి ఇదే. దీనిని బుధవారం ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ న్యూయార్క్‌లో వేలం వేయగా అంచనాకు మించి ఏకంగా 5.3 బిలియన్‌ డాలర్ల ధర పలికింది.

మన కరెన్సీలో దీని ధర దాదాపు 44 కోట్ల రూపాయలు. 24 కేజీల బరువున ఈ శిలకు ‘NWA 16788’ అని పేరు పెట్టారు. 2023లో ఆఫ్రికా ఖండంలోని నైగర్‌ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక చుక్క లేదా గ్రహశకలం భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. దాంతో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశక లంలోని చిన్న రాతిభాగాలు ఇలా భూమి మీద పడతాయి. అలా అంగారకుని నుంచి వచ్చిన ఒక గ్రహ శకలంలోని చిన్న రాతి ముక్కే ఈ శిల. చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి. ఇదొక్కటే పెద్దది. అందుకే ఇంత ధర పలికింది. భూ ఉపరితలం 75 శాతం సముద్రజలాలతో నిండి ఉంది. సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికింది అని సోత్‌బీ సైన్స్, నేచరల్‌ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షురాలు కసాండ్రా హ్యాటన్‌ చెప్పారు. అయితే ఈ రాయిని కొన్నది ఎవరో సంస్థ బహిర్గతం చేయలేదు. బుధవారం మరెన్నో అరుదైన చారిత్రక వస్తువులను వేలంవేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..

జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?

నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే

ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్‌

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా.? అయితే.. రిస్కే