వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తిరుమలలో గోవింద నామస్మరణ మారుమోగిపోతుంది. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. ఆలయాలకు వీఐపీల తాకిడి నెలకొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..