Telangana: కూల్ న్యూస్.. 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఏయే జిల్లాల్లో కురుస్తాయంటే..
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు ఎండలు ఠారెత్తించనున్నాయి. ఐఎండీ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. సో..బీకేర్‌ఫుల్..! ఇక ఈనెల 19వ తేదీన తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, పాలమూరు, భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట..
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ్టి నుంచి మాడుపగిలిపోయేలా ఎండలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఐదురోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో వేడిగాలులు వీస్తాయని తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ పలుజిల్లాలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందన్నారు.
ఇక ఈనెల 19వ తేదీన తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, పాలమూరు, భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాలజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 19వ తేదీ కూడా తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, పాలమూరు, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాలజిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటలపాటు పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, గరిష్ఠంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 48 గంటల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, 41 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ పేర్కొంది.