AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Mango Tree: ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘మోదీ’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం..! వైరల్ వీడియో..

Old Mango Tree: ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘మోదీ’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం..! వైరల్ వీడియో..

Anil kumar poka
|

Updated on: Jul 24, 2022 | 8:09 AM

Share

ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాస్తాయంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 82 ఏళ్ల కలీమ్‌ ఉల్లా ఖాన్‌ తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు


ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాస్తాయంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 82 ఏళ్ల కలీమ్‌ ఉల్లా ఖాన్‌ తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 300 రకాల మామిడి కాయలు పండిస్తున్నారు. కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఎంతగానే ఉపయోగపడుతుందని అంటున్నారు. చదువు మధ్యలోనే మానేసిన కలీమ్‌ ఉల్లా ఖాన్‌.. యుక్త వయసులోనే మామిడి చెట్టుపై తన తొలి ప్రయోగం చేశారు. కొత్త రకాలను తయారు చేసేందుకు వివిధ రకాల మొక్కలను అంటుకట్టారు. తొలుత ఏడు కొత్త రకాలను ఉత్పత్తి చేసేలా మార్చారు. కాని అది తుపాను ధాటికి నేలకొరిగింది. అయితే.. 1987 సంవత్సరం నుంచి తన ప్రయోగాలను కొనసాగిస్తూ.. 120 ఏళ్ల నాటి చెట్టుపై 300 రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. ఒక్కోటి ఒక్కో రకమైన రుచి, రంగు, ఆకారం ఉండటం వాటి ప్రత్యేకత. తన తొలి నాటి ప్రయోగంతో వచ్చిన కొత్త రకం మామిడి కాయలకు నటి ఐశ్వర్య రాయ్‌ పేరు మీద ఐశ్వర్యగా నామకరణం చేశారు కలీమ్‌. ‘ఐశ్వర్యలాగానే ఆ మామిడి పండ్లు సైతం అందంగా ఉంటాయి. ఒక్క మామిడి కాయ కిలోకిపైగా బరువు ఉంటుంది. మందమైన తోలుతో ఎంతో తియ్యగా ఉంటుంది. ‘ అని పేర్కొన్నారు. మరికొన్నింటికి ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్‌, అనార్కలి వంటి పేర‍్లు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 24, 2022 08:09 AM
Follow Us