Liver Damage: ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. లివర్‌ డామేజ్‌కు సంకేతాలు!

శరీరంలో ప్రతీ అవయవం సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అవయవంలో ఇబ్బందులు ఎదురైనా వెంటనే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ ఒకటి. ఎన్నో రకాల జీవక్రియ పనులకు కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాంటి లివర్‌ ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. లివర్‌ దెబ్బతింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

Liver Damage: ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. లివర్‌ డామేజ్‌కు సంకేతాలు!

|

Updated on: Jun 06, 2024 | 7:19 PM

శరీరంలో ప్రతీ అవయవం సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అవయవంలో ఇబ్బందులు ఎదురైనా వెంటనే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ ఒకటి. ఎన్నో రకాల జీవక్రియ పనులకు కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాంటి లివర్‌ ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. లివర్‌ దెబ్బతింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే లివర్‌ అనారోగ్యానికి గురైతే త్వరగా చికిత్స చేయిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. లివర్‌ అనారోగ్యాన్ని కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాలేయం దెబ్బతిన్న సమయంలో కడుపులో నొప్పి, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. కాలేయ పనితీరు దెబ్బతిన్న వెంటనే పొట్టపై ప్రభావం పడుతుంది. కడుపులో ఎక్కడైనా ఉబ్బినట్లు కనిపించినా, కడుపు నొప్పితో బాధపడుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల కడుపులో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది. అయితే ఈ ద్రవం అధికంగా పేరుకుపోవడం వల్ల అది పాదాలు, చీలమండలలో వాపు.. నొప్పికి కారణమవుతుంది. చీలమండలలో వాపు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాలేయ పనితీరు దెబ్బతినడం వల్ల శరీరంలో పిత్త లవణాల సాంధ్రత పెరుగుతుంది. ఇది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై అలర్జీలాగా కనిపించినా, చర్మం డ్రైగా మారినా లివర్‌లో ఏదో సమస్య ఉందని భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. జీర్ణక్రియ ప్రక్రియలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి కాలేయ పనితీరు దెబ్బతింటే.. కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మీకు వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలంగా డయేరియా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత చికిత్స చేయించుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us