AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేగంగా నడవలేకపోతున్నారా.. మీలో ఈ సామర్ధ్యం తగ్గుతోందని అర్థం

వేగంగా నడవలేకపోతున్నారా.. మీలో ఈ సామర్ధ్యం తగ్గుతోందని అర్థం

Phani CH
|

Updated on: Jun 06, 2024 | 3:19 PM

Share

సాధారణంగా వయసు మళ్లిన తర్వాత నడవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంత వేగంగా నడవలేరు.. అంతేకాదు స్థిరంగా నిల్చోలేరు కూడా. అయితే, వయసుతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో నడవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. గతంలోలాగా వేగంగా నడవలేకపోతున్నా..

సాధారణంగా వయసు మళ్లిన తర్వాత నడవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంత వేగంగా నడవలేరు.. అంతేకాదు స్థిరంగా నిల్చోలేరు కూడా. అయితే, వయసుతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో నడవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. గతంలోలాగా వేగంగా నడవలేకపోతున్నా.. అంగలు దూరంగా పడకపోయినా, నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా వెంటనే అలర్ట్ కావాలని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే.. జ్ఞాపకశక్తి తగ్గుతుందేమో కూడా ఒకసారి గమనించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నడక సమస్యలతో బాధపడేవారికి జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుముఖం పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ఇందులో భాగంగా పలువురిని పరిగణలోకి తీసుకొని పరిశోధనలు నిర్వహించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మనం నడవడం అంటే.. కాళ్ల మీద లేచి నిలబడటం, శరీరం తూలిపోకుండా స్థిరంగా ఉండటం ఒక ఎత్తయితే.. ఎక్కడికి వెళ్లాలో, ఎంత వేగంతో వెళ్లాలో, అందుకు ఎంత పెద్ద అంగలు వేయాలో నిర్ణయించుకోవటం మరో ఎత్తు. వీటన్నింటినీ మెదడు లిప్తకాలంలోనే గ్రహించేస్తుంది. వాటిని గుర్తుపెట్టుకొని అవసరమైనప్పుడు తిరిగి జ్ఞాపకం వచ్చేలా చేస్తుంది. అందుకే నడక మన జ్ఞాపకశక్తికి ఒక మంచి కొలమానంగా చెబుతుంటారు. అందుకే విషయ గ్రహణ, జ్ఞాపకశక్తి తగ్గే ముప్పు ఉన్న వారిని గుర్తించేందుకు పరిశోధకులు నకడ తీరుపై దృష్టిసారించారు. నడక ఆధారంగా జ్ఞాపకశక్తిని అంచనా వేయొచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగా కొందరిని పరిగణలోకి తీసుకొని.. అంగల దూరం, కదిలే వేగం, లయ, నడిచిన దూరం, చేతులు ముందుకీ వెనక్కీ కదిలించటం.. వంటి వాటిని కంప్యూటర్‌ దృశ్యాల ద్వారా నిశితంగా పరిశీలించారు. నడిచే తీరులో మార్పులకు జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, భాషా నైపుణ్యాలు తగ్గడానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారెవ్వా.. బుర్రుపిట్టలు తుర్రు మనేలా.. రైతు వినూత్న ఆలోచన

శునకానికి అరుదైన గుండె ఆపరేషన్‌ నిర్వహించిన ఢిల్లీ పశువైద్య నిపుణులు

సరస్సు నుంచి బయటపడ్డ ఇనుప పెట్టె !! తెరిచి చూడగ దెబ్బకి మైండ్ బ్లాక్

వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??