AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ లో ‘నెపోకిడ్స్’ అగ్గి.. భారత్ లోనూ తక్కువేం కాదు వీడియో

నేపాల్ లో ‘నెపోకిడ్స్’ అగ్గి.. భారత్ లోనూ తక్కువేం కాదు వీడియో

Samatha J
|

Updated on: Sep 15, 2025 | 3:12 PM

Share

నేపాల్‌లో నేతల వారసుల విలాస జీవితాలు జెన్ జీ ఉద్యమానికి నిప్పు రవ్వగా మారింది. ఓ వైపు దేశంలో ద్రవ్యోల్బణం, ఉపాధి కోసం నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు పాలకుల వారసులు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ లగ్జరీ కార్లు, ఫారిన్ ట్రిప్పులు వేస్తూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. తమ జల్సాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం నేపాల్ యువతకు మరింత ఆగ్రహం తెప్పించింది.

ఈ నెపో కిడ్స్ జల్సాలపై చాలా కాలంగా లోలోపలే రగిలిపోతున్న ఆ దేశ యువత తాజాగా జరిగిన ఆందోళనల్లో తమ కోపాన్ని ప్రదర్శించారు. నిరసనల్లో నెపో కిడ్స్ హాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. వారి నివాసాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అందులోని ఖరీదైన వస్తువులను దోచుకున్నారు. నేపాల్ మాజీ ప్రధాని పుష్పకమల దహల్ ప్రచండ మనవరాలు స్మిత దహల్ ఖరీదైన హ్యాండ్ బ్యాగులు సోషల్ మీడియాలో చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అలాగే నేపాల్ మాజీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బిరోధ్ ఖతివాడా కుమార్తె శృంఖల ఖతివాడా విదేశీ పర్యటనలు, లగ్జరీ జీవనశైలి జెన్‌ జీకి ఆగ్రహం తెప్పించింది. మిస్ నేపాల్ గా నిలిచిన ఆమె కుటుంబానికి సంబంధించిన ఇళ్లును జెన్ జీ నిరసనకారులు తగలబెట్టారు. తాజా ఘటనలతో ఆమె దాదాపు 1 లక్ష ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లను కోల్పోయింది. ఇక మాజీ న్యాయ శాఖ మంత్రి బిందుకుమార్ థాపా కుమారుడు సౌగత్ థాపా కూడా నెపో కిడ్ క్యాటగిరిలో టార్గెట్ అయ్యాడు. అతడి ఖరీదైన లగ్జరీ బ్రాండ్ వస్తువుల వినియోగం పై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో