ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్ వీడియో
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాను డాన్స్ మాస్టర్ గా కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న తన తొలి ఇంటిని పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మార్చుతున్నట్లు ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ హీరో ఇటీవల కాలంలో తన సినిమాల కంటే సామాజిక సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు లారెన్స్. సొంతంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి నీడగా మారారు. అలాగే అనాధ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు.
రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నారు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేతా కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. ఈ క్రమంలోనే విద్యార్థుల చదువు కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు లారెన్స్. తన సొంత ఇంటిని పాఠశాలగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా మరికొంతమంది విద్యార్థులకు ఉచిత విద్య అందించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం నటిస్తున్న కాంచన 4 సినిమా అడ్వాన్స్ తో ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టానని చెప్పారు. ఆ ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థి త్వరలో ప్రారంభం కానున్న ఆ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహించనున్నాడని లారెన్స్ తెలిపారు. తాను పెంచి చదివించిన పిల్లల్లో ఒకరు ఇప్పుడు టీచర్ గా మారి ఇదే పాఠశాలలో తొలి ఉపాధ్యాయురాలిగా చేరబోతున్నారని చెప్పడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తుందన్నారు. సేవయే దైవం అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని లారెన్స్ ఈ సందర్భంగా చేసిన ట్వీట్ లో రాసి ఉంచాడు.
మరిన్ని వీడియోల కోసం :
దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

