టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
టాయిలెట్ టూరిస్ట్ స్పాట్ ఏంటండి బాబు.. అనుకుంటున్నారా... మీరు విన్నది నిజమే...ఇది మీరు అనుకునే సాధారణమైన టాయిలెట్ కాదు. సాధారణంగా పర్యాటకులు చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలున్న ప్రదేశాలను చూసేందుకు వెళ్తారు. కానీ, చైనాలో నిర్మించిన ఓ పబ్లిక్ టాయిలెట్ అక్కడ అత్యంత ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. పర్యాటకులు అక్కడికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టడమే కాదు.. ఫోటోలు, వీడియోలు దిగేందుకు పోటీపడుతున్నారు. అందుకు ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులు ధరించి మరీ వస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా, గన్స్ ప్రావిన్స్‌లోని దున్‌హువాంగ్ నైట్ మార్కెట్‌లో ఉన్న ఈ మరుగుదొడ్డి ఇప్పుడు ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిపోయింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం… ప్రఖ్యాత మొగావో గుహలకు నెలవైన చారిత్రక సిల్క్ రోడ్ నగరంలో ఈ టాయిలెట్‌ను నిర్మించారు. దీనికి “దున్‌హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్” అని పేరు పెట్టారు. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ రెండంతస్తుల టాయిలెట్,కేవలం మరుగుదొడ్డిలా కాకుండా ఓ సాంస్కృతిక కేంద్రంలా కనిపిస్తుంది. లోపల గోడలపై దున్‌హువాంగ్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, పై అంతస్తులో “ఫాంటసీ ప్రపంచం” అనే థీమ్‌తో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ టాయిలెట్‌లో ఆధునిక సౌకర్యాలకు కొదవే ఉండదు. తల్లీబిడ్డల కోసం యాంటీ-బ్యాక్టీరియల్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లతో కూడిన ప్రత్యేక గది ఉంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, కూర్చోవడానికి సీట్లు, డ్రింక్ డిస్పెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి స్టాల్స్ బయట ఓ టైమర్ ఉంటుంది. ఎవరైనా లోపల ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే, ఆ డిస్‌ప్లే రంగు మారి హెచ్చరిస్తుంది. ఈ వింత టాయిలెట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. “నేను నైట్ మార్కెట్‌లో టాయిలెట్ కోసం వెతుకుతూ, పొరపాటున ఏదో కొత్త గుహలోకి వచ్చానేమో అనుకున్నాను” అని ఓ మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. “ఇంత విలాసవంతమైన పబ్లిక్ టాయిలెట్‌ను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం :
ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
