క్రెడిట్ కార్డ్ ఉచితం.. ఎంతవరకూ నిజం వీడియో
ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. దీంతో ప్రజలు షాపింగ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే వ్యాపార సంస్థలు కూడా కొనుగోళ్లను పెంచుకోడానికి రకరకాల ఆఫర్స్, రాయితీలు ప్రకటిస్తుంటాయి. దీనికి తోడు ఇటీవలే పలురకాల వస్తువులపై జీఎస్ట్ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈసారి పండుగలకు కొనుగోళ్లు బాగా పెరుగుతాయని చాలా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పలు బ్యాంకులు పెద్ద మొత్తంలో కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి పోటీపడుతున్నాయి.
క్రెడిట్ కార్డ్ పూర్తిగా ఉచితం.. ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదంటూ ఊదరకొడుతున్నాయి. మరి ఈ ఉచితంలో నిజమెంత? తెలుసుకోవాల్సిందే!సాధారణంగా క్రెడిట్ కార్డులను జారీ చేసే సమయంలో బ్యాంకులు స్టేట్‌మెంట్ ఫీజు అని, కార్డు పోతే కొత్త కార్డు ఇచ్చేందుకు ఫీజులు అని కొన్ని రుసుములను వసూలు చేస్తుంటాయి. ఇవన్నీ కార్డు జారీ చేసేటప్పుడు చెప్పరు. కానీ, కార్డు బిల్లులో మాత్రం వీటినీ చేర్చుతారు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తే ఓకే.. ఎలాంటి వడ్డీ ఉండదు. సాధారణంగా ఉచిత వడ్డీ కాలం 50 రోజుల వరకూ ఉంటుంది. ఇది పూర్తిగా మీ కార్డు బిల్లింగ్ తేదీపైన ఆధారపడి ఉంటుంది. బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆలస్యం చేస్తే రుసుముతోపాటు, వడ్డీ వసూలు చేస్తుంది. ప్రతి క్రెడిట్ కార్డుకూ గరిష్ఠ వినియోగ పరిమితి ఉంటుంది. తొలిసారి కార్డు తీసుకున్న వారికి ఇది కాస్త తక్కువగా ఉండొచ్చు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తూ ఉంటే, కొంత కాలం తర్వాత పరిమితిని పెంచే అవకాశం ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
