భారీ వర్షంతో అతలాకుతలం.. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
కుండపోత వర్షం హైదరాబాద్‌ని షేక్ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్‌ఫ్లడ్స్.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో, జిల్లా కలెక్టర్‌తోపాటు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ సిద్ధంచేస్తున్నారు.
కుండపోత వర్షం హైదరాబాద్‌ని షేక్ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్‌ఫ్లడ్స్.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో, జిల్లా కలెక్టర్‌తోపాటు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ సిద్ధంచేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్‌బస్తీలోనే కాదు.. చాలాచోట్ల నాలాలు కబ్జాలో ఉన్నాయన్నారు. మాంగర్‌బస్తీలాంటి ఘటనలు జరగకూడదనే హైడ్రా పనిచేస్తోందని గుర్తుచేశారు. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోందన్నారు.. అంతేకాదు.. ఏపీ, కర్నాటకలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ వస్తోందని రంగనాథ్ తెలిపారు.
మాంగర్‌బస్తీలో 145 ఇళ్లు నాలాపైనే ఉన్నాయని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. మాంగర్‌బస్తీ వాసులు ముందుకొస్తే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామన్నారు. మాంగర్‌బస్తీ సమస్యకు వారంరోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. నాలాకు అడ్డుగా ఉన్న నాలుగైదు ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. అయితే, అన్ని ఇళ్లను తొలగిస్తామని ఎవరూ భయపడొద్దని రంగనాథ్ సూచించారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

