దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో
భారతదేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి. దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం ఇది. అయితే ఈ ఏడాది నవరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగియనుంది.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే.. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో.. ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది. దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు. అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు. ఈ దసరా దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం, నూతన ఉత్సాహం, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు.శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు, శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు. ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం, ధ్యానం , దుర్గా దేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి.. జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చనేది నమ్మకం.
మరిన్ని వీడియోల కోసం :
దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
