దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..తిరుపతికి 52 ప్రత్యేక రైళ్లు వీడియో
తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు సెప్టెంబరు 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వివిధ మార్గాల్లో మొత్తం 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అదే విధంగా, తిరుపతి-విశాఖపట్నం రైలును ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు వివరించారు. ఈ మార్గంలో మొత్తం 22 సర్వీసులు నడుస్తాయి. ఇక, తిరుపతి-అనకాపల్లి-తిరుపతి మధ్య అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 27 వరకు మొత్తం 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సంబల్‌పూర్-ఇరోడ్ మధ్య కూడా రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. సంబల్‌పూర్ నుంచి ఇరోడ్ వెళ్లే రైలు సెప్టెంబరు 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఇరోడ్-సంబల్‌పూర్ రైలు సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం సర్వీసు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కూడా మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం :
దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

