Hyderabad: ఇంట్లోకి దూరి గడియ పెట్టాడు.. ఆ గృహిణి ఎవరు నువ్వు అని అడగ్గా..
నిజంగా ఇలాంటి ఘటన జరిగితే ముందు బిత్తరపోతారు. కానీ ఆ గృహిణి ధైర్యంగా గుర్తు తెలియని వ్యక్తికి చెక్ పెట్టింది. ఎవడో దుండగుడు.. మద్యం సేవించాడో.. మతిస్థిమితం లేదో తెలియదు. అపార్ట్మెంట్లోకి వచ్చి.. రెండో ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి డోర్ పెట్టి.. అక్కడ కూర్చున్నాడు. ఎవరు.. ఏంటి అంటే పిచ్చి సమాధానాలు చెప్పాడు.
హైదరాబాద్ నిజాంపేటలో గల బాచుపల్లిలో ఓ వ్యక్తి హల్చల్ చేశారు. అనుమానాస్పద వ్యక్తి అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి గడియపెట్టాడు. భయాందోళనకు గురైన ఆ ఇంట్లోని గృహిణి.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావ్ అంటూ ప్రశ్నించింది. తనను ఎవరో చంపడానికి వచ్చారు అని.. అందుకే వచ్చానని.. అరవొద్దు అంటూ సదరు వ్యక్తి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఆ గృహిణి ధైర్యంగానే ప్రశ్నిస్తూ.. అతడిని వీడియో తీసింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటూ గద్దించింది. ఇంతలో చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు కూడా వస్తుండంటంతో.. బయటకు ఆ వచ్చిన ఆ దుండగుడు.. అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ నుంచి దూకి.. పారిపోయాడు. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు స్ధానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

