ఆకాశంలో అద్భుత దృశ్యం !! ఆరోజు  మిస్సైతే 2040 వరకు చూడలేరు..

ఆకాశంలో అద్భుత దృశ్యం !! ఆరోజు మిస్సైతే 2040 వరకు చూడలేరు..

Phani CH

|

Updated on: Jun 10, 2022 | 3:50 PM

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి.

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి. వీటిని ఏ బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్లవారడానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చు. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తుంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడం చాలా అరుదు. 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్లు కన్పించాయి. అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యుడు ఉదయించకముందే చూడాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: కోడి గుడ్డును క్యాచ్‌ పట్టిన పిల్లి !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Japan: ఒంటరిగా సముద్రం దాటిన.. 83ఏళ్ల వృద్ధుడు !!

ఆర్డర్‌ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..

Published on: Jun 10, 2022 03:50 PM