AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. ఎల్‌ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్‌ వార్మింగ్‌ మార్చేస్తోందిగా!

బాబోయ్.. ఎల్‌ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్‌ వార్మింగ్‌ మార్చేస్తోందిగా!

Phani CH
|

Updated on: Oct 19, 2025 | 1:19 PM

Share

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా రుతుపవనాల వ్యవస్థ అస్తవ్యస్తం కావడం చూస్తున్నాం. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో తెలియదు. ఎండాకాలంలో వర్షాలు, వరదలు.. వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు. వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో ఎల్‌నినో, లానినా వాతావరణాల తీరు గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా మారనుందని తాజా అధ్యయనం తెలిపింది.

ప్రస్తుతం వీటిలో ఒక క్రమపద్ధతి ఉండటం లేదని, అవి మెల్లగా ఈ పద్దతికి సెట్ అవుతున్నట్టు తెలిపింది. దీని వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మరింత పెరగనున్నాయని హెచ్చరించింది. అమెరికాలోని హవాయ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ప్రపంచ వాతావరణ ప్రక్రియలను ఎన్నో ప్రభావితం చేస్తాయి. అదొక కాలచక్రంలా సాగుతుంది. ఎల్‌నినో, లానినో అనేవి పసిఫిక్‌ మహాసముద్రపు నీరు వేడెక్కడం, చల్లబడటం వల్ల జరిగే వాతావరణ మార్పులు. ఎల్‌నినోలో సముద్రం వేడెక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఎండలు, కరువు పరిస్థితులు, కొన్నిచోట్ల వరదలు వస్తాయి. లానినోలో సముద్రం చల్లబడుతుంది. వర్షాలు ఎక్కువై తుపాన్లు కూడా రావచ్చు. ఈ రెండు వ్యవస్థలు ప్రపంచంలోని వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. భూమి వేడెక్కుతున్న కారణంగా ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలో కీలక మార్పులు జరుగుతాయని పరిశోధకులు వివరించారు. దీనివల్ల మరింత బలమైన, ఒక క్రమ పద్ధతిలో ఎల్‌ నినో సదరన్ ఆసిలేసన్ ఎస్నో ఏర్పడుతుందని తెలిపారు. అదే సమయంలో దాని ప్రభావం మరింత పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గణనీయ స్థాయిలో సవాళ్లు పొంచి ఉన్నాయనీ పరిశోధనకు నాయకత్వం వహించిన సెన్‌ ఝావో తెలిపారు. దీన్ని ఎదుర్కోవడానికి మరింత మెరుగైన ప్రణాళిక, సర్దుబాటు వ్యూహాలు అవసరం అని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెట్​లో కొత్తగా ‘టెస్టు ట్వంటీ’ ఎంట్రీ

తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్‌ లో టీటీడీ ఛైర్మన్‌ క్లారిటీ

జువెలరీ షాపే టార్గెట్‌.. అయ్యాకొడుకుల ఖతర్నాక్‌ ప్లాన్‌

తపాలా శాఖ అప్‌డేట్‌.. 24 గంటల్లోనే పార్సిల్‌ డెలివరీ

Amala: నేను కోడళ్లపై పెత్తనం చెలాయించే అత్తను కాను