క్రికెట్‌లో కొత్తగా ‘టెస్టు ట్వంటీ’ ఎంట్రీ
క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది! టెస్టులు, వన్డేలు, టీ20ల తర్వాత ఇప్పుడు 'టెస్ట్ ట్వెంటీ' అనే నాలుగో ఫార్మాట్ రాబోతోంది. యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ కొత్త ఫార్మాట్‌ను హేడెన్, హర్భజన్, లాయిడ్, డివిలియర్స్ ఆవిష్కరించారు. 13 - 19 ఏళ్ల యువత కోసం ప్రత్యేకంగా, 80 ఓవర్ల పాటు సాగే ఈ ఆటలో టెస్ట్ స్ఫూర్తితో టీ20 వేగంతో ఆడతారు.
మొదటి ఎడిషన్ 2026లో ఇండియాలోనే ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్‌లో తొలి రెండు ఎడిషన్‌లు భారతదేశంలోనే జరుగనున్నాయి. మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. గేమ్ ను గ్లోబల్‌గా మరింత విస్తరించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఈ ఫార్మాట్ 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త ఫార్మాట్‌లో మ్యాచ్‌లు మొత్తం 80 ఓవర్లు ఆడతారు. రెండు జట్లు ఇన్నింగ్స్ రెండు సార్లు ఆడతాయి. ప్రతీ ఇన్నింగ్స్ 20 ఓవర్లు ఉంటుంది. అయితే, స్కోర్లు రెండు ఇన్నింగ్స్‌లలో టెస్టుల మాదిరిగానే కొనసాగుతాయి. అంటే, ఇది టెస్ట్ – టీ20 ఫార్మాట్‌ల కలిసి ఉంటాయి. కానీ ప్లేయర్లు టెస్ట్‌లా ఆలోచించాలి, టీ20లా ఆడాలి అనే సూత్రంతో రూపొందించారు. మ్యాచ్ ఫలితాలు వేగంగా వస్తాయి, కానీ ఆటలోని క్లాసిక్ టెస్ట్ స్ఫూర్తి మాత్రం ఉండేలా రూపొందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్ లో టీటీడీ ఛైర్మన్ క్లారిటీ
జువెలరీ షాపే టార్గెట్.. అయ్యాకొడుకుల ఖతర్నాక్ ప్లాన్
తపాలా శాఖ అప్‌డేట్.. 24 గంటల్లోనే పార్సిల్ డెలివరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

