తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్ లో టీటీడీ ఛైర్మన్ క్లారిటీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచబోతున్నారనే ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ధరలను పెంచే ప్రసక్తే లేదన్నారు టీటీడీ ఛైర్మన్. ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. లడ్డూ ధరల పెంపు అంటూ నిరాధార వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీపై కొన్ని ఛానళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టిటిడి ఛైర్మన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జువెలరీ షాపే టార్గెట్.. అయ్యాకొడుకుల ఖతర్నాక్ ప్లాన్
తపాలా శాఖ అప్‌డేట్.. 24 గంటల్లోనే పార్సిల్ డెలివరీ
Amala: నేను కోడళ్లపై పెత్తనం చెలాయించే అత్తను కాను
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

