ఉచిత 5జీ డేటా ఇక లేనట్లే.. ఎందుకంటే ??

ఉచిత 5జీ డేటా ఇక లేనట్లే.. ఎందుకంటే ??

|

Updated on: Jan 16, 2024 | 7:14 PM

5Gసేవలను వినియోగిస్తున్నారా? ఉచిత డేటా ఇక కొన్ని రోజుల వరకే. 5జీ సేవలకు రెండు టెలికాం సంస్థలూ మరో ఆరు నెలల తర్వాత చార్జీలు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఓ కథనంలో పేర్కొంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్, జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికతతో సేవలను అందిస్తున్నాయి.

5Gసేవలను వినియోగిస్తున్నారా? ఉచిత డేటా ఇక కొన్ని రోజుల వరకే. 5జీ సేవలకు రెండు టెలికాం సంస్థలూ మరో ఆరు నెలల తర్వాత చార్జీలు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఓ కథనంలో పేర్కొంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్, జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికతతో సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 5జీ మొబైల్‌ ఉన్న వారికి 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే డేటా సేవలను ఇస్తున్నాయి. పైగా డేటా వినియోగంపై ఎలాంటి పరిమితీ విధించడం లేదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌, జియో కంపెనీలు 4జీ ప్రీపెయిడ్‌ ప్లాన్లపైనే 5జీ సేవలనూ అందిస్తున్నాయి. ఇకపై 4జీ సేవలతో పోలిస్తే 5జీ కోసం 5-10 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5జీ సేవల కోసం చేసిన ఖర్చును రాబట్టుకోవడం కోసం రెండు టెలికాం సంస్థలూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు టెలికాం సంస్థలు ప్రస్తుత మొబైల్‌ టారిఫ్‌ ధరలను సైతం 20 శాతం మేర పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హనుమాన్‌ టీం నుంచి గుడ్ న్యూస్.. ఇక తెలంగాణలో బీభత్సమే

Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??

Guntur Kaaram: గుంటూరు టీం సీరియస్ విషయం పోలీసుల వరకు ??

Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర

Saindhav: సైంధవ్‌పై నెగెటివ్‌ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్

 

Follow us